గజ్వేల్ నుంచి గద్దర్ పోటీ
రానున్న ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే, మరే ఇతర ప్రాంతం నుంచైనా బరిలో నిలబడతానన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి (సీఈవో) రజత్‌కుమార్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నేను పుట్టింది మెదక్ జిల్లా తూప్రాన్. గజ్వేల్ నుంచి పోటీకి ఆసక్తి ఉంది. అంతకంటే ముందు అన్ని పార్టీల నేతలు, ప్రజలను కలిసి మాట్లాడతా. నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని కోరతా. ప్రచారపర్వంలో సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందాయా? లేదా? అని ప్రశ్నిస్తా. తెలంగాణ వచ్చిన తర్వాత గుణాత్మక మార్పు వచ్చిందా? పరిణామాత్మక మార్పు వచ్చిందా? అని అడుగుతా. కేసీఆర్ ఏం చెప్పాడు? ఏం చేశాడు? అని ప్రశిస్తా. 31 జిల్లాలో ప్రెస్మీట్లు నిర్వహిస్తా. దసరా తరువాత ప్రజల్లోకి వెళ్ళి, వారిని చైతన్యపరుస్తా అని అన్నారు.













