తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కుమార్తె

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా. గుమ్మడి వి.వెన్నెల నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా వెన్నెలను నియమించడంతో ఆమె ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాన్ని ప్రజల్లోకి కళాకారులు తీసుకెళ్లనున్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి వెన్నెల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.