స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు. ప్రసాద్ కుమార్ వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. గురువారం శాసనసభలో స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.













