యుద్దాన్ని కొనసాగించండి…మీకు అండగా ఉంటాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు లభిస్తున్నది. మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ (సెక్యూలర్) అధ్యక్షుడు హెచ్డీ దేవేగౌడ్ సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్ను దేవేగౌడ అభినందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దేవేగౌడ ఫోన్ చేశారు. దేవేగౌడ్ మాట్లాడుతూ మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మత తత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం మీ యుద్ధాన్ని కొనసాగించండి మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది అంటూ దేవేగౌడ తన మద్దతును ప్రకటించారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చిన సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేవేగౌడకు తెలిపారు.













