తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది : ఈటల
తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరటాన్ని గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్డుండేవాడని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకపోతే పేరు, గుర్తింపు కెప్టెన్‌కు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని అన్నారు. ఉద్యమంలో ప్రజల కాళ్ల మధ్యలో తిరిగిన వ్యక్తిని తానని అన్నారు. సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో కలిసి ఉద్యమంలో తాను పనిచేశానని గుర్తు చేశారు. చరిత్ర మొదలు కావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కా•ట్టే టీఆర్ఎస్లో పనిచేశానని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తి తామే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఎన్నిక ఉండబోతోందన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం స్ఫూర్తిని నింపిందని తెలిపారు. 2024లో తెలంగాణలో ఎగిరే జెండా కాషాయం జెండా అని అన్నారు.













