2023లో భూ స్థాపితం అయ్యేది తాను కాదు.. మీరు
13, 14 తేదీలలో తనమీదనే తానే దాడి చేయించుకుంటున్న అని మంత్రులు అంటున్నారని, తన మీద దాడికి ఏమన్నా కుట్ర చేస్తున్నారేమో అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో 2023లో భూ స్థాపితం అయ్యేది తాను కాదు మీరు (సీఎం కేసీఆర్) అని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ అబద్దాల మాటలు పక్కనబెట్టి, ముందు దళితులకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తానే రాశాను అని ఓ దొంగ లేఖ నెపం పెట్టీ ఎగపెట్టాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అన్ని వర్గాల్లోని పేదలకు 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.













