రాజీనామా చేస్తేనే చాలా వచ్చాయి… గెలిస్తే
నేను రాజీనామా చేస్తేనే చాలా వచ్చాయి గెలిస్తే ఎన్ని వస్తాయో ప్రజలంతా ఆలోచించాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితబంధు వద్దని తాను లేఖ రాసినట్లు సృష్టించారన్నారు. అందరికీ దళితబంధు ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవలేదనే సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని అన్నారు. కేసీఆర్కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. నాకు సమర్ధత, దమ్ము ఉన్నందునే పదవులు ఇచ్చారు. కేసీఆర్ ఇస్తున్న డబ్బులన్నీ మనవే అని అన్నారు. తాను పేదల గొంతుకనని గెలిపించాలని ప్రజల్ని కోరారు. అక్టోబర్ 30న కుప్పలు కుప్పలుగా కమలం గుర్తుపై ఓట్లు పడతాయని, నవంబర్ 2న టీఆర్ఎస్ నేతల దిమ్మతిరుగుతుందని అన్నారు.













