రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని జోస్యం చెప్పారు. 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండకపోవచ్చన్నారు. హుజురాబాద్ పరిస్థితే తెలంగాణ అంతటా పునరావృతం అవుందని అన్నారు. కేసీఆర్ సర్కార్‌కి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని ఈటల హెచ్చరించారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేశారు.













