చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే.. నాయకులు కాదు
చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే, నాయకులు కాదని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు కావాల్సింది బానిసలని, ఉద్యమకారుడగా తాను ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. కేసీఆర్ ఏ పథకం తెచ్చినా ఆయన బంధువులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే కేసీఆర్‌కు ఉండదన్నారు. కేసీఆర్‌కు కావాల్సింది బానిసలు, నన్ను ఓడిరచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హుజూరాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ దుర్మార్గమైన పాలను అంతమొందించే బాధ్యత నాపై ఉందన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు, భయం అన్నీ తెలిసిన వ్యక్తిని నేను. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు.













