వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ
తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన వైయస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించినట్లు ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో ఇదే గుర్తుతో వైయస్సార్టీపీ పోటీ పడనుంది. ఈ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పని చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ వారితో చర్చలు ఫలించలేదని, కాంగ్రెస్ సమాధానం కోసం వేచి చూసినా ఫలితం లేకపోవడంతో సొంతంగా బరిలో దిగుతున్నట్లు కొన్ని రోజుల క్రితమే పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.













