సీఎం కేసీఆర్ పైనే నా పోటీ… ఇక్కడ కూడా బెంగాల్ సీన్
తెలంగాణ రాష్ట్రంలో రాబోయో అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికి పోటీ గురించి ముందే చెప్పినట్లు వెల్లడించారు. ఇందుకోసం గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సీరియస్గా వర్క్ చేస్తున్నానన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సువేందు అధికారి సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందన్నారు. బెంగాల్ మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.
బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఎస్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? టీఆర్ఎస్పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో భారీ చేరికలుంటాయని, చేరికల కోసం సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందని తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయిదని తెలిపారు. అసలు కేసీఆర్ కే టికెట్ కట్ చేయాలన్నారు.













