అకున్ కు బెదిరింపు కాల్స్.. సెక్యురిటీ పెంపు
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ పై స్పందించారు డీజీపీ అనునాగ్ శర్మ. బెదిరింపు కాల్స్‌పై ఇంటెలిజెన్స్ విచారణ జరిపిస్తామని డీజీపీ చెప్పారు. అవసరమైతే అకున్‌కు భద్రత పెంచుతామని తెలిపారు. ఇదిలా ఉంటే అకున్ సభర్వాల్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పద్మారావు తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపిస్తామన్నారు. సబర్వాల్‌కు ఎలాంటి హానీ జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు మంత్రి పద్మారావు.
అకున్ సభర్వాల్ డ్రగ్స్ కేసులో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే… మరోవైపు ఈ కేసు విచారణలో పకడ్బందీగా వెళుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అకున్. సీఎం కేసీఆర్ కూడా డ్రగ్స్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని.. స్వేచ్ఛగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఈ కేసులో వరుస అరెస్టులు చేస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అకున్ కు బెదిరింపు కాల్స్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు పోలీసులు













