డా.ఎస్.కె.జోషి ఆధ్వర్యంలో అటవీ పార్కుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం
హెచ్.యం.డి.ఏ పరిధిలోని అర్భన్ పారెస్ట్ పార్కుల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను నెల రోజుల లోపు పూర్తి చేసి మార్చి 2019 నాటికి పనులన్ని పూర్తి అయ్యేలా కార్యచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో HMDA పరిధిలో అటవీ పార్కుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, HMDA కమీషనర్ చిరంజీవులు, మెట్రోరైల్ యం.డి ఎన్.వి.ఎస్ రెడ్డి, DG EPTRI బి.కళ్యాణ చక్రవర్తి, పిసిసిఎఫ్ పి.కె.ఝా, సియంఓ. ఓఎస్ డి ప్రియాంక వర్గీస్, జిహెచ్ఎంసి అదనపు కమీషనర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ HMDA పరిధిలోని ఏడు జిల్లాలో విస్తరించి ఉన్న అర్భన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్న వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మొత్తం 59 పార్కులకు గాను అటవీ శాఖ ద్వారా 15, HMDA ద్వారా 17, TSIIC ద్వారా 11, టూరిజం ద్వారా 7, ఫారెస్ట్ కార్పొరేషన్ ద్వారా 4, జిహెచ్ఎంసి ద్వారా 3, మెట్రోరైల్ ద్వారా 2 చొప్పున పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కులకు సంబంధించిన సివిల్, పెన్సింగ్ పనుల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. నిర్మిస్తున్న అర్భన్ పార్కులకు సంబంధించి EPTRI ద్వారా బెస్ లైన్ సర్వేను చేపట్టి ఇన్ ఫ్యాక్ట్ అసెన్ మెంట్ చేయాలని, భూగర్భజలాలు, ఏయిర్ క్వాలిటీలలో వచ్చిన మార్పులపై రిపోర్టును పొందాలని సి.యస్ ఆదేశించారు. పార్కు నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పార్కులనీ సహజంగా, పర్యావరణహితంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సి.యస్ అన్నారు.
——————————————————————————————————————————-
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం













