శాసనమండలిలో అడుగు పెట్టబోతున్న సురభి వాణీదేవికి శుభాకాంక్షలు : డాక్టర్ కె.వి.రమణాచారి
మాజీ ప్రధానమంత్రి స్థితప్రజ్ఞ పీవీ నరసింహారావు గారి వారసురాలిగా శాసనమండలిలో అడుగు పెట్టబోతున్న సురభి వాణీదేవికి శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యురాలు గా సురభి వాణి విజయం ఒక చారిత్రక సందర్భం. భారత ప్రధాని గా అనేక సంస్కరణలతో దేశ భవితను గాడిలో పెట్టిన పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి తనయను ఎమ్మెల్సీ గా గెలిపించడం పీవీ గారికి అసలైన నివాళి.. విద్యావంతులైన పట్టభద్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి వాణి దేవి విజయాన్ని బహుమానంగా అందించారు. పీవీ – వాణి గా బహుముఖ ప్రజ్ఞాశాలి గా విద్యావంతురాలిగా ఆమె ప్రజల వాణిని శాసనమండలిలో వినిపించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి పట్టభద్రులు మద్దతు తెలిపి వాణి గారికి గొప్ప విజయాన్ని అందించడం ముదావహం. వాణి గారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలుపునకు బాటలు వేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి ధన్యవాదములు…
-డాక్టర్ కె.వి.రమణాచారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు













