ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ మాస బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా మహిళలు అమ్మవారికి బోనం, సాక సమర్పించడం ఆరంభించారు. దివ్వ మంగళ స్వరూపిణిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో నలువైపులా ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీనివవాస్గౌడ్, మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు రేవంత్ రెడ్డి, బీబీ పాటిల్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ రామలు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.













