తెలంగాణ రాష్ట్రంలోనే తొలి రికార్డు.. తొలి ముస్లిం ఐపీఎస్‌గా
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జల్లాకు చెందిన షేక్ సలీమా తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు. కేంద్రం విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్‌ల పదోన్నతి జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన లాల్ బహదూర్, యాకూబీ దంపతుల కూతురు సలీమా. తండ్రి ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007లో గ్రూప్`1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్ అందుకున్నారు. తర్వాత అంబర్‌పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనర్ (అడ్మిన్)గా పనిచేసి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారు.













