సచివాలయ సిబ్బందికి సీఎస్‌వో.. కీలక ఆదేశాలు

సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం చుట్టూ 2 కి.మీ. వరకు 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్ లైక్ చేయొద్దన్నారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.