పెద్దపల్లి కలెక్టర్‌ను అభినందించిన సీఎస్
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్గ్రామీణ్-2019 మార్గదర్శకాలను మెరుగ్గా అమలుచేసి పెద్దపల్లి జిల్లాను దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపి సర్వోత్తమ జిల్లా జాతీయ అవార్డును పొందినందుకు కలెక్టర్ దేవసేనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ దేవసేన హైదారబాద్‌లో సీఎస్‌ను కలిశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా గురజాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతినది ఫ్రంట్ సమీపంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛతా హీ సేవదివస్లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అవార్డును అందుకున్నారు. స్వచ్చ సర్వేక్షణ్‌లో సర్వోత్తమ జిల్లాగా ఎంపికకావడంతో బాధ్యత మరింత పెరిగిందని కలెక్టర్ దేవసేన పేర్కొన్నారు.













