మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంబద్ధ పదవిలో ఉన్నవారు
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచి బుద్ధి కలగాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు, గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపని నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ లేని లోటు కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ఆటంకాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న సమాఖ్య. లౌకిక విధానాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని హితవు పలికారు.













