ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధమే
ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. 2019 మేలో అయినా, 2018 డిసెంబర్లో తాము సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలనేని తెలంగాణ ప్రజలకు శుభవార్తే అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉన్నామన్నారు. కేసీఆర్ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు.













