తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి : కేసీఆర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో నిరాదరణకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా పారుతోందని స్పష్టం చేశారు. తమ ప్రాంతాల్లో పర్యాటక, ప్రాచూర్యం పొందిన ప్రాంతాలు ఉంటే ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వాలని కోరారు.
తెలంగాణ అద్భుతమైన అటవీ సంపద, జలపాతాలు ఉన్నాయన్న కేసీఆర్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంప్రదాయాలు, గొప్ప కళల ప్రాంతం. 58 ఏళ్ల సమైఖ్య పాలనలో తెలంగాణ నిరాదరణకు గురైంది. తెలంగాణను పట్టించుకోలేదు. ప్రోత్సహించలేదు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. తెలంగాణ కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు అని అన్నారు. వారసత్వంలో వచ్చిన పూరాతన కోటలు, దోమకొండ కోట అప్పగిస్తామని చెబుతున్నారు. చారిత్రాక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందన్నారు. తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాలు పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగాను. ఉమ్మడి ఏపీలో అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌ను పట్టించుకోలేదన్నారు. ఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగాం. ఆరున్నర సంవత్సరాలు గడిచిపోతోంది. కేంద్రం కాలయాపన చేస్తోంది అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.













