ఢిల్లీలో సీఎం కేసీఆర్ రైతు దీక్ష ?
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పై యుద్దానికి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ముపేప్పట దాడికి ప్రణాళిక చేస్తున్న గులాబీ పార్టీ వాటిపై నేడు సమావేశం నిర్వహించారు. కేంద్ర వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో పాటు విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలనే విషయాలపైనా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆందోళనతో పాటు రాష్ట్రంలో ఏ రూపంలో కొనసాగించాలనే వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ ధర్నాలో తాను స్వయంగా పాల్గొంటానని ఇదివరకే స్పష్టం చేసిన ముఖ్యంత్రి కేసీఆర్ గల్లీ టు ఢిల్లీ కేంద్రంపై యుద్ధానికి క్వాడర్ను కార్యోన్ముఖులను చేయనున్నారు.













