సీఎం కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ ఏడాది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకనటలో తెలిపింది. టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్జైన్ ఈ-మెయిల్ ద్వారా ఈ విషయం తెలిపారని పేర్కొంది. ముంబయిలో వచ్చే నెల 27న జరిగే పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు వినీత్ జైన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపుగా స్వీకరిస్తున్నట్లు ఆయన అన్నారు.













