అది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష
రాజకీయాల్లోకి కుటుంబాలను, పిల్లలను లాగడం బీజేపీ పార్టీకి అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వారికి పుట్టగతులుండవని విమర్శించారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదం అన్నారు. అది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా అని ప్రశ్నించారు.













