మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ కుమార్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్ కుమార్ స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు.