బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వారిని జైలుకు : రాజ్‌నాథ్‌సింగ్
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 27 ఏళ్లుగా గుజరాత్‌ను దేశంలో ఒక మోడల్‌గా అభివృద్ధి చేశామన్నారు.
తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాజ్‌పేయి నుంచి మోదీ వరకు బీజేపీ ప్రభుత్వాలు, నాయకులపై ఒక్క అవినీతి మచ్చ లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మోసం చేసి పేపర్ లీకేజీలు చేసింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఏ ఒక్క దళితుడికి ఇవ్వలేదు అని విమర్శించారు.













