ఈటల, బండి సంజయ్ వ్యక్తులు కాదు… శక్తులు : రాజాసింగ్
ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు వ్యక్తులు కాదు, శక్తులని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్ లాంటి నాయకుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం పార్టీ కార్యకర్తల అదృష్టమన్నారు. బండి సంజయ్ కోసం అమిత్ షా బుల్డోజర్ను గిఫ్ట్‌గా పంపిస్తున్నారన్నారు. తెలంగాణలో అవినీతి దొంగలపై బుల్డోజర్లను ఎక్కిస్తామని హెచ్చరిచారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బుల్డోజర్ తిరుగబోతోందన్నారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ టీఆర్ఎస్ రాజ్యం ఉంటే, ఢిల్లీ లో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సభలో సీఎం కేసీఆర్ అవినీతిని బయట పెడతారన్న కారణంగానే ఈటలను సస్పెండ్ చేశారని అన్నారు.













