ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కాపాడే ప్రయత్నం : తరుణ్ చుగ్
ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మహిళలపై ఘోరమైన రేపులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు. రక్షక భటులే భక్షక భటులుగా మారారన్నారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లు కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్లో కూర్చొని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని, ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయాడు, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు.













