భవిష్యత్ లేకనే కేంద్రంపై.. ప్రధాని మోదీపై
భవిష్యత్ లేకనే కేంద్రం, ప్రధానిపై సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు చోటు దక్కడం, సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమన్నారు. ప్రజలు కోరుకున్నందునే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు. ఉప ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ కాడి పడేసిందని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు మునుగోడు ఉప ఎన్నికలో పునరావృతం అవుతాయని అన్నారు.













