టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసిన.. ప్రజలు బీజేపీ వైపు
టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి పోటీ చేసినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఆత్మసుత్తి, పరనింద అన్న చందంగా సాగిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నేతలు రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్లీనరీ వల్ల తెలంగాణకు జరిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టిం మరల్చేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అవినీతి సొమ్ముతో రాజకీయం చేయడంలో ఆయన రోల్ మోడల్ అని ఆరోపించారు.













