బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు.. ఎన్నో తెలుసా?
తమ పార్టీకి వచ్చిన విరాళాల వివరాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. 2022-23 ఏడాదిలో రూ.683 కోట్ల విరాళాలు అందినట్టు పేర్కొంది. ఎలక్ట్రొరల్ బాండ్స్ ద్వారా రూ.529 కోట్లు విరాళంగా వచ్చినట్టు నివేదించింది. ఎలక్ట్రొరల్ ట్రస్ట్ ఫండ్ ద్వారా రూ.90 కోట్లు విరాళంగా వచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న గంగుల కమలాకర్ రూ.10 కోట్లు, మల్లారెడ్డి రూ.4 కోట్లు, గాయత్రి గ్రానైట్ సంస్థ రూ.10 కోట్లు, హంస పవర్ కంపెనీ రూ.10 కోట్లు, రాజపుష్ప ప్రాపర్టీస్ రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఈసీ సమర్పించిన నివేదికలో బీఆర్ఎస్ పేర్కొంది.













