బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ ప్రారంభం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఆర్ట్ వర్క్ షాప్లో మహిళా చిత్రకారిణులు 50 మంది పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారంతో నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి సమన్వయం చేస్తుండగా, అనిత క్యూరేటర్ గావ్యవహరిస్తున్నారు. కేవలం మహిళలతో నిర్వహించిన 50 మంది చిత్రకారిణుల తొలి ఆర్ట్ క్యాంపు ఇదని నిర్వాహకులు తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం అధ్యక్షులు రమణారెడ్డి మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా 50 మంది చిత్రకారిణులు ఒకే సారి కాన్యాస్ పై తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడం అద్భుతమైన దృశ్యంగా ఉందని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అన్నారు.













