అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా?
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను నిరసన బీజేపీ నేతలు చేపట్టిన భీమ్ దీక్షలు ముగిశాయి. ఢిల్లీ లోని తెలంగాణ భవన్లో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం కావాలనుకుంటూ కేసీఆర్ కిందికి దిగజారిపోయారని ఆరోపించారు. దళితులు, నిరుద్యోగులు, రైతులను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని అన్నారు. రాజ్యాంగం పక్కన పెట్టి కల్వకుంట్ల రాజ్యాంగం ఉండాలి. తన విగ్రహాలు పెట్టాలని కేసీఆర్ అనుకుంటుండు. బ్రిటీష్, నిజాం పాలన చూశాము. అదే విధంగా మిమ్మల్నీ తరిమి కొడతా అని హెచ్చరించారు. ఢిల్లీలో బీజేపీ భీమ్ పాద్రయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. పాదయాత్రలో ఎంపీలు సోయం బాపూరావు, అర్వింద్ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.













