వారితో రాజీనామా చేయించి… ఎన్నికలకు రావాలి
సీఎం కేసీఆర్కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ తెచ్చింది కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 21న జరిగే బీజేపీ సభలో అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్నారు. టీఆర్ఎస్ సభకు మించి బీజేపీ సభ నిర్వహిస్తామన్నారు.













