ఇక్కడి రైతులను ఆదుకోవడం లేదు… కానీ పంజాబ్ రైతులకు
వచ్చే ఎన్నికలలో బీజేపీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యర్థించారు. నిజాం కాలేజీలో ఖేలో భారత్ జీతో భాగ్యనగర్ పేరుతో జరుగుతున్న క్రికెట్ టోర్ని ఫైనల్ మ్యాచ్ను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యం అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడి రైతులను ఆదుకోవడం లేదు కానీ, పంజాబ్ రైతులకు మాత్రం పైసలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ ఏ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.













