ఎమ్మెల్సీలుగా మహేశ్, వెంకట్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్‌మున్షీ, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.













