‘ఆయుష్మాన్ భారత్’ లోకి తెలంగాణ రాష్ట్రం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్’ లోకి తెలంగాణ సర్కార్ కూడా చేరింది. చాలా రోజులుగా ఇదే విషయంపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. ఎట్టకేలకు తెలంగాణ ఆయుష్మాన్ భారత్‌లోకి చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ (ఒప్పందం) కుదుర్చుకున్నది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందిచాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.