సీఎం రేవంత్ రెడ్డితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత్లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు అవకాశాలు, వ్యవసాయంలో అధునాతన, సాంకేతిక విధానాలపై ఉభయలు చర్చించారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













