వివాహ చట్టాన్ని మార్చలేని వారు.. ఎలా యూసీసీని
హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, ఎలా యూసీసీని అమలు చేస్తారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు, భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని అన్నారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ సీఎంను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మామలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.













