విదేశీవిద్య పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ
వివేకానంద విదేశీ విద్య పథకానికి 2022-23 సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ బ్రహ్మాణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డా.కే.వి రమణాచారి తెలిపారు. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ బ్రాహ్మాణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్ను సందర్శించి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు క్షుణ్ణంగా చదివి సరైన దృవపత్రాలు ఆన్లైన్ ద్వారా సమర్పించాలన్నారు. ఈ పథకానికి సంబంధించి మార్గ దర్శకాల మేరకు గరిష్టంగా రూ.20 లక్షలు మించకుండా బోధన రుసుము (ట్యూషన్ ఫీజు) పొందవచ్చునన్నారు. కావున అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు.













