ప్రధాని మోదీకి వ్యతిరేకంగా… రాష్ట్రవ్యాప్తంగా
బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మోదీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యువత నిరసన తెలపాలని అన్నారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరారు.













