మంత్రి కేటీఆర్ తో స్లొవేకియా రాయబారి భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో స్లొవేకియా దేశ భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ భేటీ అయ్యారు. టీహబ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై మంత్రి వివరించారు. భారత్‌లో విదేశీ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా రూపాంతరం చెందిందో వెల్లడిరచారు. గత 9 ఏళ్లుగా రాష్ట్రం ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సాధించిన అభివృద్ధిని దృశ్యమాధ్యమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి జ్ఞాపికను బహుకరించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













