శంషాబాద్ నుంచి వాషింగ్టన్కు విమానాలు
జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ ప్రారంభం అయిది. ఎయిర్ ఇండియా ఒక కొత్త విమానం 104ను ఈ ఎయిర్పోర్టుకు సేవలు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా వాషింగ్టన్కు ఈ సర్వీసు నడుస్తుంది. చికాగో తర్వాత హైదరాబాద్ నుంచి వాషింగ్టన్ రెండో నగరంగా కనెక్టివిటీని సాధించినట్లు జిఎంఆర్ సిఇఒ ఎస్జికె కిశోర్ వెల్లడించారు. అంతర్జాతీయ రాకపోకలకు వీలుగా హైదరాబాద్ నుంచి ఎక్కువ అమెరికాకే ప్రయాణిస్తారని, ఇప్పటిఏక 6.75 లక్షలమంది ప్రయాణీకులు సాలీనా విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు అన్నారు. దక్షిణమధ్యభారత్కు అమెరికా లోని వాషింగ్టన్కు రాకపోకలు సాగించేందుకువీలుగా హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్టు గేట్వేగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు వాషింగ్టన్నుంచి రాకపోకలు సాగించేందుకు ఈ ఎయిర్పోర్టు బహుళప్రయోజనకారిగా ఉంటుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకకు కూడా విమానసర్వీసులు ప్రారంభమౌతాయని అన్నారు. ఇకపై వాషింగ్టన్ కు హైదరాబాద్లోనే నేరుగా ఇమిగ్రేషన్, వీసాచెకింగ్, బ్యాగేజీ చెకింగ్ మొత్తం పూర్తి అవుతాయన్నారు.













