150 ఏళ్ల తర్వాత మళ్లీ బ్లూ మూన్
150 ఏళ్ల తర్వాత మళ్లీ బ్లూ మూన్ కనిపించనున్నది. ఈ నెల 31న చంద్ర గ్రహణం ఉన్నది. ఆ సంపూర్ణ గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్ రిపీట్ అవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ నెలలోనే రెండవ సారి అదే రోజున పున్నమి రానున్నది. గ్రహణం మధ్యరాత్రి వేళ ఉంటుందని, చంద్రుడి దిశగా పసిఫిక్ సముద్రం కదులుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సెంట్రల్, ఈస్టర్న్ ఏషియాలో పాటు ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ గ్రహణం దర్శనమివ్వనున్నది. భారత ఉపఖండంలోనూ బ్లడ్ మూన్ కనిపిస్తుందని నిపుణులు తెలిపారు. సుమారు 77 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడిలోని దిగువ భాగం అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. మళ్లీ 2028, డిసెంబర్ 31వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం చోటుచేసుకోనున్నది. ఆ తర్వాత మళ్లీ 2037, జనవరి 31న సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంటుంది. గతంలో 1866, మార్చి 31వ తేదీన చివరిసారి బ్లూ మూన్ కనిపించింది.













