ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మూెత్సవాలు
దేశ రాజధాని ఢిల్లీలోని గోల్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బాలాజీ ఆలయంలో ఈ నెల 7 నుంచి 17వ తేదీవరకు బ్రహ్మూెత్సవాలు నిర్వహించనున్నారు. నగరం నడిబొడ్డున సుమారు రెండున్నర ఎకరాల్లో టీటీడీ నిర్మించిన ఆలయం 2013 మే 2న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏటా మేలో ఇక్కడ బ్రహ్మూెత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే క్రమంలో ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ప్రతిరోజూ తిరుమల తరహాలో బ్రహ్మూెత్సవాలు నిర్వహించబోతున్నట్లు ఏపీభవన్ ప్రత్యేక రెసిడెంట్ కమిషనర్ రజత్‌భార్గవ, అదనపు కమిషనర్ అర్జాశ్రీకాంత్, ఆలయ ఏఈవో ఆనంద్ తెలిపారు.













