హైదరాబాద్- కొలంబో మధ్య స్పైస్ జెట్ సేవలు
హైదరాబాద్ నుంచి కొలంబోకు నేరుగా సేవలను ప్రారంభిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. దీంతోపాటు మరో 10 కొత్త ఫ్లైట్లను కూడా కంపెనీ ప్రారంభించింది. ఒక దేశీ విమానయాన కంపెనీ హైదరాబాద్-కొలంబోల మధ్య నేరు సర్వీస్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ ఫ్లైట్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుందని, మంగళ, బుధవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ సేవలు ఉంటాయని తెలిపింది. వ్యాపార ప్రయాణికులతోపాటు విహార యాత్రల కోసం వెళ్లే ప్రయాణికులు కూడా ఈ రెండు నగరాల మధ్య పెరుగుతున్నారని స్పైస్‌జెట్ పేర్కొంది.













