20 కొత్త రూట్లలో స్పైస్ జెట్ సేవలు
కొత్త గమ్యాలకు కొత్త సర్వీసులు ప్రవేశపెడుతున్నట్టు స్పైస్‌జెట్ ప్రకటించింది. వీటిలో 18 విమానాలు దేశ ఆర్థిక రాజధాని వివిధ మెట్రో, నాన్ మెట్రో నగరాలతో కలుపుతాయి. కొత్త సర్వీసుల్లో ముంబై నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, తిరువనంతపురం కూడా ఉన్నాయి. ఈ మూడు సర్వీసులను వచ్చే శనివారం నుంచి గురువారం (26-30 తేదీలు) మధ్య ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కొత్త సర్వీసుల్లో ముంబై- కోల్‌కతా సర్వీసు మినహా మిగతా సర్వీసులన్నీ రోజువారీ నడుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి స్పెస్‌జెట్ 106 కొత్త సర్వీసులు ప్రకటించగా 73 సర్వీసులు ముంబై, 16 సర్వీసులు ఢిల్లీ నగరాలను ఇతర గమ్యాలతో కలుపుతాయి.













