శుభవార్త చెప్పిన ఆర్బీఐ
ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది. 5.4 శాతానికి రెపో రేటు తగ్గింది. 35 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు తగ్గడం వరుసగా ఇది నాలుగోసారి. 9 ఏళ్ల కనిష్ట స్థాయికి రెపో రేటు తగ్గడం విశేషం. దీని ప్రభావంతో బ్యాంకు వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. గృహ, వ్యక్తిగత రుణాలపై రెపో రేటు పాజిటివ్ ప్రభావం చూపనుంది. ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్న సమయంలో మార్కెట్లో ధన ప్రవాహం పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య పాలసీ కమిటీ సిఫార్సులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు.













