కర్ణాటక సీఎస్‌గా తెలుగు మహిళ?
కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీప్ సెక్రటరీ)గా ఓ తెలుగు మహిళ నియామకం కానున్నారు. హైదరాబాద్‌కు చెందిన రత్నప్రభ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. 2016 మే నుంచి ఆమె అదనపు ముఖ్య కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వాణిజ్య పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సుభాష్ చంద్ర కుంటియా ఈ నెల 21న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానంలో రత్నప్రభ నియామకం జరగనుంది. కర్ణాటకలో మరో ఏడు నెలల్లో ఎన్నికలు ఉన్న దృష్ట్యా దళిత వర్గానికి చెందిన రత్నప్రభను సీఎస్‌గా నియమించడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తోంది.













