చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. 30 నిమిషాల విన్యాసం కోసం ఈ యుద్ధవిమానం ఇవాళ ఉదయం 9:58కి బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరింది. కాగా బయల్దేరే ముందు 45 స్క్వాడ్రన్ ఫ్లయింగ్ డాగర్స్‌కు చెందిన పైలట్లు విమానం గురించి రాజ్‌నాథ్‌కు పరిచయం చేశారు. ఏవియానిక్స్, నియంత్రణ, రాడార్, గ్లాస్ కాక్‌పిట్లతో పాటు యుద్ధంలో ఇది మోసుకు పోయే ఆయుధాలను కూడా వివరించారు. డీఆర్డీవో చీఫ్ డాక్టర్ సతీశ్ రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కొద్దిసేపు రక్షణమంత్రిగా కూడా తేజస్‌ని నియంత్రిస్తూ నడిపించారు అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాజ్‌నాథ్ కలగజేసుకుంటూ పైలట్ తివారీ ఎలా చెబితే అలా నడుపుతూ వచ్చాను. ఏ సమస్యా ఎదురు కాలేదు అని పేర్కొనడంతో అందరి ముఖంలో నవ్వులు విరిశాయి.













